
వైఎస్ఆర్ ఆశయాలు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: చెక్క శ్రీను
తుగ్గలి, జూలై 26( వెలుగు న్యూస్): తుగ్గలి మండలం చిన్న జొన్నగిరి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత చెక్క శ్రీను హైదరాబాద్‌లోని మణికొండలో వైఎస్ విజయమ్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలపై ఇరువురు కొద్దిసేపు చర్చించారు. అనంతరం చెక్క శ్రీను మాట్లాడుతూ, వైఎస్ కుటుంబం పట్ల తమకు ప్రత్యేక గౌరవం ఉందని పేర్కొన్నారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనతో పాటు పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!

