ఆస్పరిలో సీఎం సభకు తుగ్గలి నుంచి భారీగా తరలిన టీడీపీ శ్రేణులు

ఆస్పరిలో సీఎం సభకు తుగ్గలి నుంచి భారీగా తరలిన టీడీపీ శ్రేణులు

తుగ్గలి జూలై 25 ( వెలుగు న్యూస్ ): కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నిర్వహించిన కార్యక్రమానికి తుగ్గలి మండలం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. వివిధ గ్రామాల నుంచి వాహనాల్లో చేరుకున్న వారు సభలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు, చెన్నంపల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ సలహాదారుడు పొన్నార్సు దేవేంద్ర మాట్లాడుతూ, ఎన్నికల హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మండలం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎద్దులదొడ్డి రామనాథ్, రవికుమార్, బోలా మల్లికార్జున, బోలా రంగస్వామి, అక్బర్ బాషా, కోటేష్ గౌడు, చెన్నంపల్లి నారాయణ, బలరాముడు, అరవ భీముడు ఆయాద్ బాషా, తదితరులు పాల్గొన్నారు.



 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS