రేపే ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం: జాతీయ ప్రధాన కార్యదర్శి రామ కొండ వెంకటేశ్వర్లు

రేపే ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం: జాతీయ ప్రధాన కార్యదర్శి రామ కొండ వెంకటేశ్వర్లు

పత్తికొండ (న్యూస్ వెలుగు )జూన్ 12: ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని పత్తికొండ కేంద్రంగా నిర్వహించడం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకొండ వెంకటేశ్వర్లు పత్తికొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున దళితులు హాజరుకానున్నట్లు వారు వెల్లడించారు. పత్తికొండ పట్టణ కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపము లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు షాలేం రాజు మాదిగ ముఖ్య అతిథులుగా హాజరు కాలినట్లు వారు వెల్లడించారు. జిల్లా కార్యవర్గ సమావేశం అనంతరం నూతన జిల్లా కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులికొండ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున దళితులు హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు. ఇప్పటికే పత్తికొండ కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS