ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన పవన్
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ప్రకృతి విపత్తుకు గురైన ప్రజలకు భరోసాగా ఉన్న సీఎం చంద్రబాబు మాటలతో మరింత ఉత్తేజాన్ని కలిగించిదన్నారు. ఎలాంటి కష్టకాలంలో ప్రజలకు అండగా ఉన్న సీఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అధికార సంక్షోభం, వ్యవస్థల నిర్వీర్యం, వనరుల దోపిడీ వారసత్వంగా గత ప్రభుత్వం నుండి వచ్చింన్నారు . ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి వైపరీత్యం, వీటి నడుమ మీ పాలనా దక్ష్యత, విధి నిర్వహణలో మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, అభినందనీయమన్నారు. ఇలాంటి సమయంలో మన ప్రజలను ఆదుకోవడం మన ప్రభుత్వంతో పాటుగా వ్యక్తిగత స్థాయిలో నా కనీస బాధ్యతగా భావిస్తున్నానన్నారు . సహాయ కార్యక్రమాల్లో పంచాయతీ రాజ్, RWS శాఖలు యుద్దప్రతిపదికన పాల్గొంటున్నారని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. త్వరలోనే మనం ఈ సంక్షోభం నుండి బయటపడుతామని ఆశిస్తున్నామన్నారు.