
డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం తగదు: డివైఎఫ్ఐ
జమ్మలమడుగు టౌన్ ( న్యూస్ వెలుగు ): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వివిధ రకాల కారణాల చేత డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల లో జాప్యం తగదని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల.శివకుమార్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది అన్నారు. గత ప్రభుత్వం ఒక్క డిఎస్సీ కూడా వదలకుండా నిరుద్యోగులను మోసం చేయడంతో నిరుద్యోగులు విసిగి వేసారి ఉద్యోగాల కోసం మార్పు కోసం రాష్ట్రంలోని నిరుద్యోగులు గంపగుత్తగా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించడంలో నిరుద్యోగులు కీలక పాత్ర వహించారు అన్నారు.తదనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గారు డిఎస్సీ పై మొదటి సంతకం చేశారు కానీ గడిచిన నాలుగు నెలలు అవుతున్నా డిఎస్సీ నోటిఫికేషన్ రాలేదు అన్నారు.టెట్ అన్నారు తర్వాత ఫలితాల విడుదల అన్నారు అదిగో,ఇదిగో డిఎస్సీ నోటిఫికేషన్ అన్నారు ఉరిస్తున్నారు కానీ ఇప్పటికీ నోటిఫికేషన్ రావడం లేదు అన్నారు.ఇప్పుడు కృష్ణ,గుంటూరు జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ కారణంగా మళ్ళీ నోటిఫికేషన్ విడుదల కాదేమో అని నిరుద్యోగుల్లో భయాందోళన మొదలైంది అన్నారు.డిఎస్సీ నోటిఫికేషన్ కోసం సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లలో శిక్షణా తీసుకుంటూ వున్నారని అన్నారు.ప్రభుత్వం వీరి సమస్యను గుర్తించి డిఎస్సీ నోటిఫికేషన్ పై క్లారిటీ ఇచ్చి నోటిఫికేషన్ విడుదల లో జాప్యం చేయకుండా విద్యా శాఖ మంత్రి లోకేష్ గారు చూడాలని కోరుతున్నామని అన్నారు.