డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అభినందించిన సీఎం చంద్రబాబు
అమరావతి : వరద ప్రాంత ప్రజల కోసం ఎంతో ఉదాత్తంగా భారీ విరాళం ప్రకటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి, వరద బారిన పడ్డ 400 పంచాయితీలకు రూ.4 కోట్లు, తెలంగాణ వరద ప్రాంతాలలో సహాయ కార్యక్రమాలు చేసేందుకు మరో రూ.కోటి ఇవ్వడం ఆయన విశాల హృదయానికి అద్దం పడుతున్నదని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన దాతృత్వాన్ని ప్రదర్శించడంలో తనకు తానే సాటిగా ప్రవర్తించే పవన్ కళ్యాణ్ సమాజంలో ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ప్రజలకు ఆయన చేస్తున్న సేవలకు విలువ కట్టలేం. అదే విధంగా ఆయన కురిపిస్తున్న వాత్సల్యానికి ఏదీ సరితూగదని కొనియాడారు . ఆయనకు మరో సారి ధన్యవాదాలు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!