తుగ్గలి మండలంలో వరుస దొంగతనాలు పట్టించుకునే వారు ఎక్కడ ..?

తుగ్గలి మండలంలో వరుస దొంగతనాలు పట్టించుకునే వారు ఎక్కడ ..?

తుగ్గలి న్యూస్ వెలుగు : కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో  వరుస దొంగతనాలు గ్రామీణ ప్రజలను  ఆందోళన కలిగిస్తున్నాయి. తుగ్గలి మండలంకేంద్రం , పేండేకల్లు రైల్యే స్టేషన్ లో ఆగస్టు నెలలో రెండు సార్లు వరుస దొంగతనాలకు పాల్పడినా …  అపరిచితుల పై పోలీసు నిఘా  యంత్రాంగం ఘోరంగా  విఫలమయ్యారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి.ఆఘస్ట్ 5న అర్ధరాత్రి పేండేకల్లు ఆర్ ఎస్ లో అపరిచితులు ఓ చిల్లర దుకన్నాని బద్దలుకొట్టి దొంగతనం  చేయగా , ఆఘస్ట్ 30న మరోసారి దొంగలు పేండేకల్లు ఆర్ ఎస్ లో వీరంగం సృష్టించారు. రైల్యే స్టేషన్ పరిధిలోని  ఓ బట్టల దుకాణ యజమాని ఇంట్లో దొంగలు లూటీ చేయగా ,  మరో గోబీ సెంటర్లోనూ, దేవాలయాల్లో , దొంగతనానికి  పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం పై బాధితులు పాలీసులకు సమాచారం అందించగా పోలీసులు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏదేమైనా పేండేకల్లు రైల్యే స్టేషన్ లో గతంలో రెండు సార్లు ఇద్దరు వ్యక్తులు   అత్యంత కిరాతకంగా  హత్యకు కూడా గురయ్యారని బండ రాళ్లతో తలపై బాది హత్యకు గురైనట్లు స్థానికులు వెల్లడించారు. ఈ లాంటి సంఘటనలు తరచుగా పేండేకల్లు ఆర్ ఎస్ లో జరుగుతున్నా ..పోలీసులు మాత్రం పట్టి పట్టనట్లు గా వ్యవహిస్తున్నారని,  ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పేండేకల్లు రైల్యే స్టేషన్ పరిధిలో 30కి పైగా గ్రాములు బ్యాంకులకు ,  రైల్యే స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు , బెంగుళూరు , హైదరాబాదు , గుంటూరు వంటి ప్రాంతాలకు వెళుతున్నారని  అర్ధరాత్రులు ప్రయాణికులు ప్రయాణించాలంటే వణుకు పుడుతుందని కొంత మంది ప్రయాణికులు న్యూస్ వెలుగు ప్రతినిధికి  తెలిపారు.  ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు , ప్రజాసంఘాలు కోరుతూన్నారు.                                                                                             ( పాతచిత్రం)

Author

Was this helpful?

Thanks for your feedback!