తుగ్గలి మండలంలో 72.45 శాతం ఉత్తీర్ణత

తుగ్గలి మండలంలో 72.45 శాతం ఉత్తీర్ణత

తుగ్గలి న్యూస్ వెలుగు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో తుగ్గలి మండల విద్యార్థులు సత్తా చాటారు. తుగ్గలి మండల వ్యాప్తంగా పదవ తరగతి ఫలితాలలో 72.45 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.మండల పరిధిలోని గల పెండేకల్లు ఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు 84 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత సాధించారు. పెండేకల్ జడ్పీ హైస్కూల్ నందు 560 మార్కులతో శిల్ప మండలంలో మొదటి స్థానంలో నిలువగా,559 మార్కులతో అప్సన రెండవ స్థానంలో నిలిచింది.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నరేంద్ర ప్రసాద్,ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.అదేవిధంగా తుగ్గలి లోని కస్తూరిబా పాఠశాల యందు 92 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఎస్.ఓ షాహిన్ తెలియజేశారు.జొన్నగిరి హాస్టల్ నందు విద్యనభ్యసిస్తున్న పదవ తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రమేష్ తెలియజేశారు.ఈ సందర్భంగా విద్యార్థులతో మరియు హాస్టల్ సిబ్బందితో కలిసి కేకును కత్తిరించి సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు.మండల కేంద్రమైన తుగ్గలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలయం 47 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు బాబురావు తెలియజేశారు.తుగ్గలి జడ్పీ పాఠశాల యందు 541 మార్కులతో టాపర్ గా నిలిచిన ఆయేషా సిద్దిఖా ను ఆయన అభినందించారు.అదేవిధంగా మండల కేంద్రమైన తుగ్గలిలో గల నోవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు విద్యార్థులు పదవ తరగతి ఫలితాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారని పాఠశాల యాజమాన్యం తెలియజేసింది.

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS