తెలుగమ్మా! నీవెక్కడ?

తెలుగమ్మా! నీవెక్కడ?

తెలుగు భాష కోసం వెతికా,
తెలుగు తల్లిని నేనడిగా,
నువ్వెక్కడ?… ఎక్కడని?

ఆంధ్రులలో అలుసై
ఆంగ్ల మాధ్యమ సదువులతో,
ఆ సర్కారు బడులలో కూడా,
ఆదరణ కరువై,
అవసాన దశలో ఉన్నానని,
నా తెలుగు తల్లి బదులిచ్చింది.

పద కవితతో అన్నమయ్య,
నీతి పద్యాలతో వేమన,
తెలుగు కృతులతో త్యాగరాజు,
వాడుక భాషతో గిడుగు,
తెలుగు భాషకు కీర్తిని తెచ్చినా…..
పర భాష కొరకు పరుగు పెడుతుంది,
నేటి యువతరం.

ఆధునిక విజ్ఞాన వ్యాప్తికి,
విరేశలింగం పంతులు,
గురజాడ అప్పారావు,
తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి,
సామాన్యుడికి చేరువ చేసిన,
మనకు తెలియడం లేదు,
తెలుగంటే గొప్ప వెలుగని,

అందుకే తెలుగును చదువుకుందాం,
తెలుగులో మాట్లాడు కుందాం!
తెలుగు భాషను రక్షించుకుందాం.

✍.. దుంపాల వీరేష

Author

Was this helpful?

Thanks for your feedback!