దాడి చేసిన వారి పై కేసు నమోదు చేయండి : టిఎం రమేష్ 

దాడి చేసిన వారి పై కేసు నమోదు చేయండి : టిఎం రమేష్ 

ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగ

వెల్దుర్తి ,న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామంలో 13,12,2024 తేదీన రాత్రి 7:30 గంటల సమయం లో  మాదిగ ప్రసాద్ అనిల్ ఇద్దరు కలిసి వారి ఇంటి నుండి బస్టాండ్ అంగడి వరకు దిగువపేట కాలనీ నందు సిసి రోడ్డు మీద మోటార్ సైకిల్ పై పోతున్న సందర్భంలో అక్కడే ఉన్న నలుగురు బీసీ వ్యక్తులు సీసీ రోడ్డు వేసి రెండు రోజులు కాలేదు మీరు సిసి రోడ్డు మీద వస్తారా మాదిగ నా కొడుకుల్లారా అంటూ కులం పేరుతో దూషిస్తూ ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం కుట్ర పని దౌర్జన్యంతో కట్టెలు ఇనుప రాడ్లు తో విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు ఎందుకు కొడుతున్నారని అడిగితే మాకు ఎదురు చెప్తారా మాదిగ నా కొడుకుల్లారా మిమ్మల్ని గ్రామం నుండి బహిష్కరిస్తాం చంపేస్తాం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని దాడి చేశారు ఈ దాడిలో నిందితులు కొడుతున్న దెబ్బలకు తట్టుకోలేక కేకలు వేస్తే అక్కడే ఉన్న కొంతమంది విడిపించారు వారిపై కూడా దాడులు చేసి దౌర్జన్యం చేసి భయపడించారు పథకం ప్రకారం కుట్ర పన్ని ఉద్దేశపూర్వకంగా మాదిగ యువకులపై దాడి చేశారు దాడి గురైన బాధితులు 13వ తేదీ 12వ నెల 2024 రోజున వెల్దుర్తి పట్టణం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో డాక్టర్ ద్వారా చికిత్స తీసుకొని అనంతరం వెల్దుర్తి పోలీస్ స్టేషన్కు పోయి ఫిర్యాదు చేశారు న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు తప్ప ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇప్పటికైనా పత్తికొండ డిఎస్పి కర్నూల్ ఎస్పీ డిఐజి గారు స్పందించి మాదిగలపై ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం కుట్ర పన్ని దౌర్జన్యంతో గ్రామ బహిష్కరణ చేస్తాం చంపుతామని బెదిరించి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ పంపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడమైనదిఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిడ్డయ్య మాదిగ
కర్నూలు జిల్లా కార్యదర్శి మద్దిలేటి మాదిగ, వెల్దుర్తి మండలం అధ్యక్షుడు మద్దిలేటి మాదిగ
వెల్దుర్తి మండలం ప్రధాన కార్యదర్శి రమణ మాదిగ ,తుగ్గలి మండలం కార్యదర్శి ప్రకాష్ మాదిగ ఎమ్మార్పీఎస్ఎస్ నాయకులు ఏసోబు మాదిగ, రామళ్లకోట గ్రామస్తులు వెంకటేశ్వర్లు ప్రసాద్ సామెల్ తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!