
దూరదృష్టిగల నాయకుడు రాహుల్ గాంధీ : క్రాంతి నాయుడు
న్యూస్ వెలుగు పత్తికొండ : కులగణన కు పత్తికొండ కాంగ్రెస్ కమిటీ పూర్తి మద్దతు ఉంటుందని పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అడ్వకేట్ క్రాంతి నాయుడు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టే దిశగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నిర్ణయాన్ని పూర్తి హర్షం తో స్వాగతిస్తున్నాము. ఈ విషయములో రాహుల్ గాంధీ ముందడుగు వేసి, కులగణనకు మద్దతుగా గొప్ప పోరాటం చేయడం వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి బలపడ్డదని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కులగణన విధానాన్నిప్రారంభించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా విస్తరించే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషించనుందన్నారు . ఈ దిశగా మా నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా, రాహుల్ గాంధీ దూరదృష్టిని అభినందిస్తూ మా పూర్తి మద్దతును తెలియజేస్తున్నామన్నారు. కులగణన తోనే సమానత్వం, సమాన హక్కులు సాధ్యం అని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విశ్వసిస్తుంది అందుకే ఏపీసీసీ వైఎస్ షర్మిల రెడ్డి ఆదేశానుసారం, ఈ కులగణన ప్రక్రియను సాధించడంలో కీలకపాత్ర పోషించిన రాహుల్ గాంధీ కి మా కృతజ్ఞతలు తెలిపారు.