దెబ్బతిన్న ఘాట్ రోడ్ ను పరిశీలించిన సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీ డీన్
ఇంద్రకీలాద్రి న్యూస్ వెలుగు : ఇటీవల భారీ వర్షములకు కొండ చరియలు పడి ఘాట్ రోడ్ నందు దెబ్బతిన్న ప్రాంతాన్ని సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీ డీన్ పాండురంగారావు తో కలిసి పరిశీలించినట్లు ఆలయ ఈవో కె ఎస్ రామరావు తెలిపారు. దెబ్బతిన్న ప్రాంతములో మళ్ళీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా రిటైనింగ్ వాల్ నిర్మించుటకు ప్లాన్స్ ను అతి తక్కువ సమయములో దేవస్థానం నకు అందజేస్తామని సిద్దార్థ కాలేజీ డీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ కె వి ఎస్ కోటేశ్వరరావు తో పాటుగా ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!