దేశంలో వైద్య సౌకర్యాలు మెరుగు పడ్డాయి : కేంద్ర మంత్రి

దేశంలో వైద్య సౌకర్యాలు మెరుగు పడ్డాయి : కేంద్ర మంత్రి

ఢిల్లీ :   దేశంలో డాక్టర్-జనాభా నిష్పత్తి దాదాపు 1:811గా ఉందని, ఇది డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణం 1:1000 కంటే మెరుగైనదని కేంద్ర  ప్రభుత్వం తెలియజేసింది. 13.86 లక్షలకు పైగా అల్లోపతి వైద్యులు, 6.14 లక్షల మంది ఆయుష్ వైద్యులు జాతీయ వైద్య కమిషన్, రాష్ట్ర వైద్య మండలిలో నమోదై ఉన్నారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. గడచిన 10 ఏళ్లలో దేశంలో వైద్య కళాశాలల సంఖ్య 387 నుంచి 780కి పెరిగిందని, 2014 నుంచి ఎంబీబీఎస్‌ సీట్లు 130 శాతం పెరిగి 51,348 నుంచి 1.18 లక్షలకు పెరిగాయని మంత్రి వివరించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS