దేశ ప్రధానికి లేఖ రాసిన ఐఎంఎ
డిల్లీ : ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో జరిగిన సంఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసినట్లు తెలిపారు. వైద్య సిబ్బందిపై హింసను నిరోధించడానికి కేంద్ర ప్రత్యేక చట్టం తీసుకురావలని లేఖలో ప్రధానిని కోరినట్లు ఐఎంఎ వెల్లడించింది. అన్ని ఆసుపత్రుల భద్రతా ప్రోటోకాల్‌లు అనుగుణంగా ఉండాలని IMA కోరింది. ఆసుపత్రులను సేఫ్ జోన్‌లుగా ప్రకటించాలని, తొలి అడుగు తప్పనిసరిగా భద్రతాపరమైన అర్హతలు కల్పించాలని డిమాండ్ చేసింది.
IMA తన లేఖలో, నిర్దిష్ట కాలవ్యవధిలో నేరం యొక్క ఖచ్చితమైన , వృత్తిపరమైన దర్యాప్తు చేసి బాదితులకు న్యాయం చేకూరలన్నారు. మరణించిన కుటుంబానికి తగిన, గౌరవప్రదమైన పరిహారం ఇవ్వాలని లేఖలో రాసుకొచ్చినట్లు మీడియాకు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చట్టాలను అమలు చేయాల్సిన బాద్యత ప్రభుత్వం పై ఉందని తెలకలో ఐఎంఎ తెలిపింది.