దోమలపై మీనాస్త్రం
న్యూస్ వెలుగు ;కుంటలు, చెరువులు, నిల్వ నీటిలోని దోమలకు చెక్ పెట్టడానికి ఏపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ ప్రయోగించనుంది. ఇప్పటి వరకు రకరకాల మందులు, రసాయనాలు, యంత్రాల సాయంతో దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు సహజ సిద్దంగా నివారించేలా ప్రయత్నిస్తోంది. మందులు, రసాయనాల జోలికి పోకుండా.. చేపలతో దోమలకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.
నిల్వ నీటిలో గంబూసియా చేపలు (Gambusia) వదలడంతో దోమల ఉద్ధృతి తగ్గుతోంది. లార్వా దశలోనే చేపలు తినేయడంతో వాటి పెరుగుదల నిలిచిపోతోంది. మూసీ లాంటి మురుగు నీటిలో కాకుండా సాధారణంగా నిల్వ ఉండే నీరు, కొద్దిగా మురికిగా ఉండే నీటిలో ఈ చేపలు మనుగడ సాగిస్తాయి. ఒక్కొక్క చేప రోజుకు 100 నుంచి 300 లార్వాలను ఆహారంగా తీసుకుని దోమల సంతతి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి.
దోమలు దండెత్తే కాలమిది… ఆ మొక్కలతో చెక్పెడదాం…
నీరు పుష్కలంగా, వాటి జీవన పరిస్థితులకు అనుకూలంగా ఉండటంతో వాటి సంతతి ఊహించని రీతిలో పెరిగింది. నగరంలోని ఇతర చెరువుల్లోనూ ఇదే తరహాలో వృద్ధి చెందుతున్నాయి. ఆయా చెరువుల నుంచి గంబూసియా చేపల (Gambusia fishes)ను సేకరించి కొరత ఉన్న జలవనరుల్లో వదులుతున్నారు.
Fish farming: మత్స్యరంగంలో అపార అవకాశాలు!
వాతావరణాన్ని తట్టుకుంటాయి..
ఉష్ణోగ్రతలో మార్పులు, నీటి కాలుష్యాన్ని తట్టుకొని జీవించే శక్తిని అంచనా వేసి.. ఈ చేపలు గుడ్లు పెడుతాయి. దోమల లార్వా, తవుడు ఇతర పదార్థాలు వీటికి ఆహారంగా వేస్తారు. సంవత్సరం పొడవునా ఈ చేపలు గుడ్లు పెట్టి.. పిల్లలు కంటాయి. ఒక ఈతలో 25 నుంచి 100 పిల్లలను.. కొన్నిసార్లు.. 100-12000 పిల్లలను కంటాయి. గరిష్ఠంగా సాధారణ చేప పొడవు 4.5 సెం.మీ ఉంటుంది. కానీ.. గంబూసియా (Gambusia) రకంలో ఆడ చేప పొడవు 5.2 మీ నుంచి 6.8 సెం.మీ ఉంటుంది. వీటి జీవితకాలం ఏడాదిన్నర. రోజుకు 100 నుంచి 300 వరకు దోమల లార్వాను తినేస్తాయి. కాబట్టి దోమల నివారణకు చెరువులు, కుంటల్లో వదిలేలా చర్యలు తీసుకుంటున్నారు.