ద్యార్థుల మృతి బాధాకరం :ఉప ముఖ్యమంత్రి
కాకినాడ జిల్లా : రోడ్డు ప్రమాద ఘటనలో ఇద్దరు విద్యార్థుల మృతి బాధాకరం. ఒకవైపు విద్యార్థులు మరణిస్తే, పోలీసులు వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమన్నారు . పోలీసులు బాధితులతో వ్యవహరించే పద్ధతి మార్చుకోవాలని సూచించారు. పోలీసుల తరపున వారి కుటుంబాలకు క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. ఇంతటి బాధలో కూడా విద్యార్థి రేవంత్ అవయవదానం చేసేందుకు ముందుకొచ్చిన తల్లిదండ్రుల మానవత్వం కదిలించిందని వారు తెలిపారు. బాధితులకు నా ట్రస్ట్ నుండి 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలలో కేసుల భయం కాకుండా, తక్షణ సాయం అవసరమని అభిప్రాయ పడ్డారు. ఈ విషయంలో అవగాహన కల్పించే దిశగా పోలీసులు పనిచేయాలని వారికీ సూచించారు.
Was this helpful?
Thanks for your feedback!