నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందుబాటులో ఉండాలి
మైలవరం,న్యూస్ వెలుగు ;కడప జిల్లా మైలవరం మండల పరిధిలోని మైలవరంలొ సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని . బుధవారం భారత కమ్యూనిస్టు పార్టీ మైలవరం మండల సమితి ఆధ్వర్యంలో స్థానిక తహశీ ల్దార్ కార్యాలయం వద్ద నిత్యావసర వస్తువులను ధరలు తగ్గించాలని ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రతిష్టపరచాలని పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలు అదుపులో ఉంచాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసి అనంతరం డిప్యూటీ తాసిల్దార్ రూపేష్ వినతిపత్రం అందదేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల సహాయ కార్యదర్శి వెంకటరమణ, ముని రెడ్డి మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయాలన్న జాతీయ పార్టీ సమితి పిలుపుమేరకు ఇవాళ డీజిల్ గ్యాస్ ధరలు అమాంతం పెరిగి సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి ఉన్నది డీజిల్ పెంపుతో ఉప్పు,పప్పు,నూనె చింతపండు,అన్ని రకాల నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదని విమర్శించారు.
అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థలో కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారని అక్కడ 14 రకాల నిత్యావసర వస్తువులను ప్రజలకు అందించాలని కోరారు.ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం 100 రోజుల లోపల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తానన్న మాటలు నీటి మూటలుగా మిగిలాయే తప్ప ఆచరణకు నోచుకోలేదన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మధు, శీను, రంగనాయకులు, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.