పంట నమోదును పరిశీలించిన అధికారులు

పంట నమోదును పరిశీలించిన అధికారులు

ఆలూరు న్యూస్ వెలుగు : హోళగుంద మండల పరిధిలో గురువారం నేరణికి, చిన్నహ్యట గ్రామాల్లో జరుగుతున్న పంట నమోదు కార్యక్రమాన్ని మండల వ్యవసాయాధికారి ఆనంద్ లోకదళ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు తమ పొలాల్లో వేసిన ప్రతి పంటను స్థానిక రైతు సేవ కేంద్రాన్ని సంప్రదించి ఈ-క్రాప్ బుకింగ్ & ఈకేవైసి తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి తెలిపారు.అలాగే ఈ-క్రాప్ బుకింగ్ చేసుకునేందుకు సెప్టెంబర్ 15 చివరి తేది అన్ని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ విరూపాక్షి,ఎంపిఈఓ నరసింహ,సచివాలయం సిబ్బంది తస్లీమా,రమణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!