
పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు
కర్నూలు (న్యూస్ వెలుగ): జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యోనమః పరమ పవిత్రమైనటువంటి అయ్యప్ప స్వామి వారి దీక్షాధారణ స్వీకరించి శబరిమల యాత్రకు నిజామాబాద్ నుండి కాలినడకన ప్రయాణం చేయుచున్న సువర్ణభూమి అయ్యప్ప భక్తులు శనివారం కర్నూలు సూర్యనారాయణ స్వామివారి దేవాలయ దత్త కళాక్షేత్రము నందు శ్రీ అయ్యప్ప స్వామి వారి అభిషేకము పడిపూజ వైభవోపేతముగా నిర్వహించడం జరిగినది. ఇందులో అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు. ఎం శ్రీనివాస రావు గారు కుటుంబ సభ్యులు మరియు ఎస్వీ రమణారెడ్డి గారు వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారములతో మరియూ సూర్య దేవాలయ ట్రస్టీ సభ్యులు T. శివ రామకృష్ణ గారు మాతృమండలి సభ్యులు సహకారముతో అయ్యప్ప భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగినది.
Was this helpful?
Thanks for your feedback!

