పాఠశాలల్లో విద్యార్థులు డ్రాపౌట్స్ ఉండకూడదు: కలెక్టర్

పాఠశాలల్లో విద్యార్థులు డ్రాపౌట్స్ ఉండకూడదు: కలెక్టర్

కర్నూలు (న్యూస్ వెలుగ): పాఠశాలల్లో విద్యార్థులు డ్రాపౌట్స్ ఉండకూడదని, పిల్లల్ని వలసలకు తీసుకువెళ్ళే తల్లిదండ్రులతో మాట్లాడి డ్రాపౌట్స్ కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి విద్యా శాఖాధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో మండల విద్యా శాఖాధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల్లో ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో తల్లిదండ్రులు విద్యార్థులను కూడా తమతో తీసుకెళ్ళకుండా తలిదండ్రులతో సమావేశాలు ఏర్పాటుచేసి, విద్యార్థులు ఇక్కడే ఉండేలా ఒప్పించాలని విద్యా శాఖాధికారులను ఆదేశించారు. జిల్లాలో 76 సీజనల్ హాస్టల్ లను ఏర్పాటు చేశామని, ఇంకా అవసరమైతే విద్యార్థులను ఇతర హాస్టళ్లలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

పాఠశాలల్లో 8 వ తరగతి నుండి 10 వ తరగతి లో ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్య తో పాటు బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలను గురించి వివరించాలని ఉపాధ్యాయులకు చెప్పాలని కలెక్టర్ ఆదేశించారు..జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఎక్కువగా నమోదవుతున్నాయని, ఇందువల్ల తల్లులు అనారోగ్యం పాలు కావడం, శిశువులుమరణించడం, ఒక్కోసారి తల్లులు కూడా మరణించడం జరుగుతుందని, ఇలాంటి విషయాలన్నీ పిల్లలకు చెప్పడం వల్ల వారు బాల్య వివాహాలు చేసుకోవడానికి నిరాకరించే అవకాశం ఉంటుందని కలెక్టర్ వివరించారు. ప్రతి పాఠశాలలో ఒక మహిళ టీచర్ను ఈ అంశానికి సంబంధించి నోడల్ ఆఫీసర్ గా నియమించి, విద్యార్థులకు బాల్య వివాహాలు చేస్తే సమాచారం అందించి, వాటిని ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీఈఓను ఆదేశించారు. బాల్యవివాహాలతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడం, హైజీన్ పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి విషయాలు కూడా తెలియజేసి పిల్లలలో మంచి అలవాట్లు వచ్చేలా చూడాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో పదవ తరగతిలో మంచి ఉతీర్ణతా శాతాన్ని సాధించాలని, అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఈవో లను ఆదేశించారు. పదవ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించాలని, స్టడీ అవర్స్ లో విద్యార్థులకు స్నాక్స్ అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. మ్యాథ్స్, ఇంగ్లీష్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఈరోజు రెండు సబ్జెక్టులలో మంచి పునాదులు వేయడం వల్ల విద్యార్థులు పైకి వస్తారని తెలిపారు.

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం నాణ్యతగా ఉండేలా చూడాలని ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి పిల్లలకు మంచి రుచి కలిగిన భోజనాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.. తాగునీరు అన్ని స్కూళ్ళలో ఉందాఅని కలెక్టర్ ఆరా తీశారు.. కొన్ని పాఠశాలల్లో తాగునీరు లేదని, ఆర్వో ప్లాంట్స్ పనిచేయడం లేదని, గ్రామం నుండి పైప్ లైన్ వేస్తే బాగుంటుందని, ఎంఈఓ లు కలెక్టర్కు సూచించగా, వెంటనే డిపిఓ ను పిలిపించి ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేసి, విలేజ్ అవుట్ లెట్ నుంచి స్కూల్స్ కు పైప్ లైన్ 15 రోజుల్లో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. టాయిలెట్స్ కు సంబంధించి స్వచ్ఛభారత్ మిషన్ కింద పాఠశాలల్లో 17 కోట్లతో ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు పంపామని కలెక్టర్ తెలిపారు ..దేవనకొండ పాఠశాలలో పెచ్చులూడిపోయిన సంఘటనను ప్రస్తావిస్తూ, పిల్లలకు ప్రమాదాలు జరిగితే ఎలా అంటూ, అలా శిథిలమైన భవనాల్లో తరగతులు నిర్వహించవద్దని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు.

కర్నూలు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మంచి క్వాలిఫికేషన్ ఉన్న టీచర్లు ఉన్నారని, విద్యాబోధన కూడా అలాగే ఉండాలని కలెక్టర్ సూచించారు.. జిల్లా విద్యకు సంబంధించిన అన్ని అంశాల్లో ముందుండాలని, కర్నూలు జిల్లా ఎంఈవోలు ద బెస్ట్ అనిపించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో విద్యార్థులకు విద్యాబోధన అందించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఎక్కడా తక్కువగా ఉండకూడదని, సమాజంలో వారు ఉన్నత స్థానాలు చేరుకునేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని కలెక్టర్ సూచించారు.ఈ

సమావేశంలో డిఇఓ శామ్యూల్ పాల్,డిప్యూటీ డీఈవోలు రాజేంద్రప్రసాద్, వెంకటరమణారెడ్డి ఎంఈవోలు పాల్గొన్నారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!