
ప్రజల ప్రాణాలు కోల్పోతున్నా పాలకులు రోడ్డు విస్తరణ చేయరా ?
పత్తికొండలో రోడ్డు విస్తరణ వెంటనే చేపట్టాలి. ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్
రోడ్డు విస్తరణ చేపట్టే అంతవరకు పోరాటాలు ఉధృతం చేస్తాం. సిపిఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి.
2029 లో వచ్చే ఎన్నికలకు కూడా రోడ్డు విస్తరణ చేపడతామని నాయకులు ప్రజల ముందుకు వస్తారా?
న్యూస్ వెలుగు పత్తికొండ: పత్తికొండ పట్టణంలో రోడ్డు విస్తరణ చేపట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక గుత్తి రోడ్డులో ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి ఆటోలు, లైట్ మోటార్ వెహికల్స్, ద్విచక్ర వాహనాలతో పట్టణ పురవీధుల గుండా అంబేద్కర్ సర్కిల్ మీదుగా నాలుగు స్తంభాల కూడలి వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగు స్తంభాల కూడలి దగ్గర రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా ఆటో కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్, పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రంగారెడ్డి, హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్తికొండ పట్టణంలో ఇరుకైన రోడ్ల కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పాలకులు అధికారులు రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టారా అన్నారు. రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టే అంతవరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.2029 లో వచ్చే ఎన్నికలకు కూడా రోడ్డు విస్తరణ చేపడతామని నాయకులు ప్రజల ముందుకు వస్తారా? అని వారు ప్రశ్నించారు. కొందరి ప్రయోజనాల కోసం గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే వాహనదారులు పట్టణ ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతున్న పాలకుల మొండి వైఖరి వల్ల విస్తరణ కార్యక్రమానికి నోచుకొని పత్తికొండ పట్టణంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్న అటు నాయకులు ఇటు అధికారులు నిమ్మకు నీరెత్తినటువంటి విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పత్తికొండ పట్టణం రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టాలని లేనిపక్షంలో వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా పత్తికొండ బందుకు కూడా పిలుపునిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు దస్తగిరి రామాంజనేయులు రజక సంఘం నాయకులు ఈరన్న సిఐటియు మండల అధ్యక్షులు గోపాల్ ప్రజానాట్మండలి జిల్లా నాయకులు కాశన్న మండల కార్యదర్శి శివశంకర్ రైతు సంఘం రాజుల కారప్ప ఆటో కార్మిక సంఘం నాయకులు శేఖర్ బాలు సురేష్ శీను. లైట్ మోటర్ వెహికల్స్ కార్మికులు ద్విచక్ర వాహనదారులు సిఐటియు అమాలి కార్మిక సంఘం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

