ప్రజల భాగస్వామ్యంతో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి 

 ప్రజల భాగస్వామ్యంతో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి 

35 సీసీ కెమెరాలను ప్రారంభించిన .. కర్నూలు ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపీఎస్

* నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత కీలకం.

కర్నూలు, న్యూస్ వెలుగు : తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బి. తాండ్రపాడు సమీపంలోని కాదంబరి టౌన్‌షిప్‌లో ఏర్పాటు చేసిన 35 సీసీ కెమెరాలను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా కర్నూలు ఎస్పీ గారు మాట్లాడుతూ…నేరాల నియంత్రణ, దర్యాప్తు వేగవంతం చేయడం, ప్రజలకు భద్రత కల్పించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.కర్నూలు జిల్లాలోని ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్, వ్యాపార సంస్థల వద్ద నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా నేరాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చునన్నారు.సీసీ కెమెరాలు నేరాలను గుర్తించడంలోనే కాకుండా, నేరస్తులను వేగంగా గుర్తించి చట్టం ముందుకు తీసుకురావడంలో అత్యంత కీలకమైన ఆధారాలుగా నిలుస్తున్నాయన్నారు.అలాగే రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, గొడవలు, మహిళలు మరియు చిన్నారుల భద్రతకు సంబంధించిన కేసుల విచారణలో సీసీ కెమెరాల ద్వారా లభించే దృశ్యాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరస్థుల్లో భయాన్ని కలిగించడంతో పాటు, నేరాలకు పాల్పడే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గుతాయన్నారు.ప్రతి కాలనీ, గ్రామం, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల దర్యాప్తు మరింత సులభతరం అవుతుందని వివరించారు.సమాజ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పోలీసులు, ప్రజల సమన్వయంతోనే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎస్పీ గారితో పాటు కర్నూలు డిఎస్పీ రాఘవేంద్ర, సిఐ కేశవరెడ్డి, కర్నూలు తాలూకా సీఐ తేజమూర్తి, కాదంబరి టౌన్‌షిప్ కాలనీ సెక్రటరీ మధుమోహన్, ప్రెసిడెంట్ కరుణాకర్ బాబు, కాదంబరి టౌన్‌షిప్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS