రివర్ వ్యూ కాలనీ స్థల వివాదంపై క్షేత్రస్థాయిలో విచారణ

రివర్ వ్యూ కాలనీ స్థల వివాదంపై క్షేత్రస్థాయిలో విచారణ

చట్టబద్ధమైన రికార్డుల ఆధారంగా బాధితుడికి న్యాయం చేయాలని అధికారులకు ఆదేశం

రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు మేకల భిక్షం (దాసు)

కర్నూలు, న్యూస్ వెలుగు : కర్నూలు నగరంలోని రివర్ వ్యూ కాలనీలో ప్రభుత్వ కేటాయింపు భూమికి సంబంధించిన స్థల వివాదంపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు మేకల భిక్షం (దాసు) శుక్రవారం క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు. బాధితుడు హెచ్. శ్రీనివాసులు సమర్పించిన వినతిపై కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, సంబంధిత అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించి, సంబంధిత రికార్డులు, పత్రాలను పరిశీలించారు. బాధితుడు సమర్పించిన వివరాలు, రెవెన్యూ మరియు మున్సిపల్ శాఖల రికార్డులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ సభ్యులు మాట్లాడుతూ, ప్రభుత్వం చట్టబద్ధంగా కేటాయించిన భూములకు సంబంధించిన అన్ని రికార్డులను సమగ్రంగా పరిశీలించి, బాధితుడికి ఎలాంటి అన్యాయం జరగకుండా చట్టపరమైన నిబంధనల మేరకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్నట్లు నిర్ధారణ అయితే, సంబంధిత నిబంధనల ప్రకారం స్థలాన్ని తిరిగి బాధితుడికి అప్పగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు స్పందిస్తూ, సంబంధిత రికార్డులను నిష్పాక్షికంగా పరిశీలించి, చట్టబద్ధమైన ఆధారాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS