
క్రౌన్ ఆఫ్ రాయలసీమ’ పోటీల్లో కడప చిన్నారుల ఘనవిజయం
బెస్ట్ స్మైల్’అవార్డ్ గా సిరి చందన, ‘ఐకానిక్ స్టార్’ విన్నర్ గా వేద ప్రణవి
కడప , న్యూస్ వెలుగు: కడప పట్టణంలోని మారుతి నగర్ కాలనీకి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రాంతీయ స్థాయిలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘క్రౌన్ ఆఫ్ రాయలసీమ-2026’ అందాల పోటీల్లో తమ అద్భుత ప్రతిభతో మెరిశారు. మారుతి కాలనీకి చెందిన సురేష్ కుమార్, అమృత వాణి దంపతుల కుమార్తెలు సిరి చందన, వేద ప్రణవి ఈ పోటీల్లో ఘన విజయం సాధించి కడప నగర కీర్తిని చాటారు.రాయలసీమ నలుమూలల నుండి వందలాది మంది మోడల్స్, యువతీ యువకులు, మరియు చిన్నారులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్న ఈ పోటీల్లో ఈ ఇద్దరు సిస్టర్స్ జడ్జీలను విశేషంగా ఆకట్టుకున్నారు.సిరి చందన (బెస్ట్ స్మైల్ అవార్డు): ప్రిన్సెస్ కేటగిరీ విభాగంలో పోటీపడిన సిరి చందన, తన అద్భుతమైన నవ్వుతో, ఆత్మవిశ్వాసంతో స్టేజ్ పైన మెప్పించి ‘బెస్ట్ స్మైల్’ అవార్డును కైవసం చేసుకుంది.వేద ప్రణవి (ఐకానిక్ స్టార్ విన్నర్): తన కేటగిరీలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన రెండవ కుమార్తె వేద ప్రణవి, నిర్వాహకుల ప్రశంసలు అందుకుంటూ ‘ఐకానిక్ స్టార్ విన్నర్’గా నిలిచి తన సత్తా చాటింది.గ్రాండ్ ఫినాలే వేదికపై నిర్వాహకులు ఈ ఇద్దరు బాల విన్నర్లకు ప్రత్యేకమైన క్రౌన్ జ్ఞాపిక, మోడల్,సర్టిఫికెట్లతో పాటు పలు బహుమతులను అందజేసి ఘనంగా సత్కరించారు.
కూతుళ్ల విజయం వెనుక ఆదర్శ మాతృమూర్తి:
పిల్లలు కేవలం ఇల్లు, చదువులకే పరిమితం కాకూడదని, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే ఏదైనా సాధించగలరని నిరూపించడానికి వారి తల్లి అమృతవాణి ధైర్యంగా ముందడుగు వేశారు. తమ పిల్లల ప్రతిభను గుర్తిస్తూ వారిని సమాజంలో ఉన్నత స్థానాల్లో నిలబెట్టాలనే లక్ష్యంతో ఆమె శ్రమించారు. ఇంటి పనులను చక్కబెట్టుకుంటూనే, తన కుమార్తెలను ఈ పోటీలకు సిద్ధం చేసి, వారి అపారమైన విజయంలో ఆమె కూడా భాగస్వామ్యమయ్యారు.చిన్న వయసులోనే రాయలసీమ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన సిరి చందన, వేద ప్రణవిలను మారుతి నగర్ కాలనీ వాసులతో పాటు పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు.

