జాతీయ ప్రధాన కార్యదర్శిగా రామకొండ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పులికొండ ఎన్నిక…ఘనంగా సత్కరించిన దళిత సంఘాల నాయకులు 

జాతీయ ప్రధాన కార్యదర్శిగా రామకొండ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పులికొండ ఎన్నిక…ఘనంగా సత్కరించిన దళిత సంఘాల నాయకులు 

కర్నూలు : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అధ్యక్షతన హైదరాబాద్ లో జరిగిన సమావేశాల్లో నూతన కమిటీలను ఆయన ప్రకటించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా రామకొండ వెంకటేశ్వర్లు మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా బురుజుల పులికొండను ఎంపిక చేసినట్లు ఆయన ప్రకటించారు. దింతో వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం పత్తికొండ కేంద్రంగా ఏర్పాటు చేసిన సభలో వారిని ఘనంగా శాలువాలతో దళిత సంఘాల నేతలు సత్కరించినట్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ..దళితులపై జరుగుతున్న అనేక దాడులను ఎదుర్కొంటూ ఉద్యమాలను ఊపిరిగా చేసుకుని దళిత వర్గాలకు చేదోడుగా నిలిచామన్నారు. దాదాపు 30 ఏళ్ల పోరాటంతో రిజర్వేషన్లను సాధించినట్లు తెలిపారు.రాష్ట్ర,జాతీయ కార్యవర్గంలోకి కర్నూలు నుంచి తమకు అవకాశం కల్పించింనందుకు జాతీయ అధ్యక్షులు

ఉసురుపాటి బ్రహ్మయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మార్పీఎస్ తమకు మరిన్ని బాధ్యతలను ఇచ్చిందని వాటిని అమలు పరిచే దిశగా ఉద్యమాలను చేస్తామన్నారు. జాతీయ స్థాయిలో దళితులపై జరుగుతున్న దాడులను వారి ఖండించారు.. దళితులకు అందాల్సిన హక్కుల, నిధుల వాటాలను ప్రభుత్వ అమలుపరచలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గంప నరసింహులు, చండోలి ప్రసాద్,ఫోటో రాజు, కాళ్ళ రంగస్వామి, హోసూరు సుధాకర్, దను, హోసూర్ రాజశేఖర్, రామకొండ గురుస్వామి, గంప నరసింహులు, మాల కేశవ, నరసామల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS