జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించవద్దు

జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించవద్దు

డోన్, న్యూస్ వెలుగు : స్టిక్కర్ల పేరుతో జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించవద్దని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ముత్యాల శివరామయ్య ఆచారి కోరారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యూఆర్ కోడ్‌తో జర్నలిస్టులకు పోలీసుశాఖ సంకేళ్ళు వేయడానికి ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.
జర్నలిస్టుల గుర్తింపు కార్డులకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు పేరుతో మీడియా ప్రతినిధుల స్వేచ్ఛను నియంత్రించే చర్యలకు పాల్పవద్దని కోరారు.కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్ఎన్ఐ సర్టిఫికెట్ల ఆధారంగా మీడియా యజమాన్యాలు ఇచ్చిన గుర్తింపు కార్డులను ప్రామాణికంగా తీసుకొని సమాచార శాఖ అక్రిడేషన్ కార్డులను జారీ చేస్తుందని తెలిపారు. సంస్థలు జారీ చేసే గుర్తింపు కార్డులను ప్రభుత్వమే గుర్తించినప్పుడు మీరు ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. జర్నలిస్టుల విధి నిర్వహణలకు ఆటంకం కలిగించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. నెల్లూరు, అన్నమయ్య, నంద్యాల జిల్లాల పోలీస్ అధికారులు అక్రిడేషన్ ప్రమాణికంగా ప్రెస్ స్టిక్కర్లు ఇస్తామని ప్రకటించడానికి ఖండించారు. ప్రెస్ స్టిక్కర్లను ఇవ్వడానికి పోలీస్ శాఖకు ప్రభుత్వం నుండి జీవోను జారీ చేశారా అని ప్రశ్నించారు. సమాచారం సేకరించడానికి మాత్రమే అందించే అక్రిడేషన్ కార్డు జర్నలిజానికి ప్రమాణికం కాదని గుర్తు చేశారు. ప్రభుత్వ అనుమతులతో ఏర్పాటుచేసిన మీడియా సంస్థల గుర్తింపు కార్డులను
పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్టిక్కర్ల పంపిణీ ఆలోచన మానుకోవాలని లేని పక్షంలో న్యాయపరమైన పోరాటాలకు సిద్ధమని ప్రకటించారు. నియోజకవర్గ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ జర్నలిస్టులపై అనుమానాస్పద దృష్టితో కాకుండా, ప్రజలకు సమాచారాన్ని చేరవేసే బాధ్యతగల వృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని కోరారు. క్యూఆర్ కోడ్ పేరుతో అదనపు పరిమితులు విధిస్తే జర్నలిస్టుల విధి నిర్వహణకు ఆటంకం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గ ఉపాధ్యక్షులు మణిధర్ రావు మాట్లాడుతూ జర్నలిస్టుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని, మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలను విరమించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి విజయ్, కోశాధికారి జయకర్, సహాయ కార్యదర్శి ప్రసాద్, రంగన్నగౌడు, యాగంటి,జెర్మియా, కార్యదర్శి సుధాకర్, కోశాధికారి శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ,సుధాకర్, కే శ్రీనివాసులు యాదవ్, అంజి, గిరి, మహేష్ పృథ్వీరాజ్, రంగారెడ్డి పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS