పత్తిని కొనుగోలు చేయండి అధికారులను ఆదేశించిన : జాయింట్ కలెక్టర్
కర్నూలు న్యూస్ వెలుగు : రైతులకు మేలు చేకూరే విధంగా పత్తిని కొనుగోలు చేసి రైతులకు చెల్లించవలసిన మొత్తము వెంటనే చెల్లించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య CCI (కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) వారిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో DLPC (డిస్టిక్ లెవెల్ పర్చేజ్ కమిటీ) సభ్యులతో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పత్తి పండించే రైతుల నుండి వారికి మేలు చేకూరే విధంగా పత్తిని కొనుగోలు చేసి వారికి చెల్లించవలసిన మొత్తము ఎటువంటి అసౌకర్యము కలగకుండా వెంటనే చెల్లిచాలని CCI (కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా)వారిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. గ్రామస్థాయిలో పత్తి పండించిన రైతుల వివరాలు VAA ద్వారా నమోదు చేయించాలని వ్యవసాయ శాఖ జెడి ని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. పత్తి కొనుగోలుకు తగిన సౌకర్యాలు కల్పించవలసినదిగా, పత్తి నాణ్యత గురించి రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా మార్కెటింగ్ అధికారిని, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. జిన్నింగ్ మిల్లుల వారు కంప్యూటర్, నెట్, C.C. కేమరాలను పరిశీలించి అందుబాటులో ఉంచుకోవలసినదిగా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, CCI సెంటర్ ఇంచార్జ్ అధికారులు మరియు పత్తి వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.