పార్టీ సభ్యత్వ నమోదును జయప్రదం చేయండి : బిజేపి
ఆలూరు :హోళగుంద మండల కేంద్రంలో మంగళవారం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఏఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు,కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఓబిసి మోర్చా కార్యదర్శి మురళి నాయుడు,జిల్లా జనరల్ సెక్రెటరీ కోటి యాదవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ప్రపంచంలోనే 12 కోట్లు పైగా పార్టీ సభ్యులు ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని వారు అన్నారు. అయితే ప్రస్తుతం సెప్టెంబర్ 1,2024 10 కోట్ల పైగా సభ్యత్వాలు చేయాలని జాతీయ పార్టీ లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని వారు తెలిపారు. కావున
దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి మండలములో బూతు స్థాయిలో బూతుకు 200 మంది చొప్పున సభ్యత్వ నమోదు చేయాల్సిందిగ పార్టీ కార్యకర్తలను కోరారు.ఈ కార్యక్రమంలో సభ్యత నమోదు జిల్లా కిషన్ మోర్చా జనరల్ సెక్రెటరీ రామలింగ,మండల ప్రధాన కార్యదర్శి ఉలిగన్న, మహేషలను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎడ్యుకేటీ మెంబర్ జక్కన చారి,మండల వైస్ ప్రెసిడెంట్ వీరేష్,బెనకప్ప,కలప్ప ఆంజనేయ,మండల బీజేవైఎం అధ్యక్షుడు బసవ,చిన్న, దుర్గాప్ప,రామాంజనేయులు,ఓబీసీ మోర్చా అధ్యక్షుడు జయప్ప గౌడ్,రాజా తదితర పాల్గొన్నారు.