
పెరిగిన విద్యా బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం
Delhi ( ఢిల్లీ ) : కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రవేశ పెట్టిన గ్రాంట్‌ల డిమాండ్‌లను లోక్‌సభ ఆమోదించింది. నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే 2047 నాటికి భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధిస్తుందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం విద్యకు బడ్జెట్ కేటాయింపులు పెరిగాయని అన్నారు. డిమాండ్లపై జరిగిన చర్చకు ప్రధాన్ సమాధానమిచ్చారు. సభలో విద్యా మంత్రిత్వ శాఖ మంజూరు చేసిందన్నారు. 2013-14లో విద్యారంగానికి 4 లక్షల 30 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారని, అది నేడు 9 లక్షల 19 వేల కోట్లకు పెరిగిందని వివరించారు. 2013-14 నుండి ఉన్నత విద్య కోసం బడ్జెట్ కేటాయింపులలో 78 శాతం పెరుగుదల ఉందని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!