
పేదరిక నిర్మూలనకు పి4: సీఎం
అమరావతి : పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ‘జీరోపావర్టీ-పీ4’ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చైర్‌పర్సన్‌గా, డిప్యూటీ సీఎం వైస్ చైర్‌పర్సన్‌గా రాష్ట్ర స్థాయిలో పటిష్ట వ్యవస్థ నెలకొల్పుతున్నారు. ఇందుకు అనుసంధానంగా కాల్ సెంటర్, టెక్ టీమ్, ప్రోగ్రాం టీమ్, వింగ్ టీమ్ ఉంటాయి. జిల్లా చాప్టర్‌కు జిల్లా మంత్రి చైర్‌పర్సన్‌గా, నియోజకవర్గ చాప్టర్‌కు ఎమ్మెల్యే చైర్‌పర్సన్‌గా, గ్రామ, వార్డు స్థాయిలో సెక్రటేరియట్ చాప్టర్లకు చైర్‌పర్సన్‌గా పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు ఉంటారు. దాతలు కావాలనుకుంటే కుటుంబాలను, మండలాలను, గ్రామాలను కూడా దత్తత తీసుకోవడంతో పాటు, నిధులు సమకూర్చేలా పీ4 రూపకల్పన చేశారు.
Was this helpful?
Thanks for your feedback!