
పేదల కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం :మంత్రి నారలోకేష్
ఉండవల్లి న్యూస్ వెలుగు : మంగళగిరి నియోజకవర్గంలో పేదల దశాబ్దాల కల నెరవేరిందని మంత్రి నరలోకేష్ అన్నారు . మొదటి విడత లోపేదలకు శాశ్వత హక్కు కల్పిస్తూ 3 వేల ఇళ్ల పట్టాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉండవల్లి గ్రామానికి చెందిన లబ్దిదారులకు మొదటి పట్టా అందజేసినట్లు వేల్లడించారు . కొన్నే ఏళ్ల క్రితం ఉండవల్లి అమరారెడ్డి నగర్ లోని కొండ పోరంబోకు స్థలంలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. రజక కులానికి చెందిన గోవిందు డ్రైవర్ గా పనిచేస్తుండగా, భార్య సీతామహాలక్ష్మి బట్టలు ఉతకడం, ఇస్త్రీ పనిచేసి బిడ్డలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తాము ఉంటున్న స్థలానికి పట్టా ఇప్పించాలని గతంలో వారు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 నెలల్లోనే దశాబ్దాల సమస్యను పరిష్కరించారాని బాదితులు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు నేరుగా వారి ఇంటికి వెళ్లి బట్టలు పెట్టి మరీ శాశ్వత ఇంటి పట్టాను అందజేసినట్లు మంత్రి నరలోకేష్ తెలిపారు .