కర్నూలు న్యూస్ వెలుగు :

కిశోరి వికాసం ద్వారా బాలికల సర్వతో ముఖాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కిశోరి వికాసం-వేసవి శిక్షణ కార్యక్రమాల ప్రణాళిక మే 2వ తారీకు నుండి జూన్ 10 వరకు పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…బాలికలకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘కిశోరి వికాసం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందని తెలిపారు..ఈ కార్యక్రమం ద్వారా విద్య, ఆరోగ్యం, నైపుణ్యం, ఎదుగుదల, పోటీతత్వం, వ్యక్తిగత శుభ్రత వంటి 12 అంశాలపై బాలికలకు అవగాహన కల్పించనున్నారని కలెక్టర్ తెలిపారు.. బాల్య వివాహాలు జరగకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఆడపిల్లలు స్కూల్ డ్రాప్ అవుట్ లు కకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు..బాలల హక్కుల చట్టం పోస్కో గురించి పూర్తి అవగాహన కలిగించాలని కలెక్టర్ సూచించారు.ఐసీడీఎస్ తోపాటు డీఆర్డీఏ, మెప్మా, విద్య, వైద్య, పోలీసు శాఖలు, ఇంటర్ బోర్డు, ఎస్ఎస్ఏ, స్కిల్ డెవలప్మెంట్, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి నిర్మల , డి ఎం హెచ్ ఓ శాంతి కళ, డిసిపిఓ శారద , లీగల్ ఆఫీసర్ శ్రీలక్ష్మి , సామాజిక కార్యకర్త నరసింహులు మరియు కౌన్సిలర్ నాగేశ్వరరావు లు పాల్గొన్నారు.
Thanks for your feedback!