పౌష్ఠిక ఆహారం అందించడం మన బాధ్యత : సీడీపీఓ లలిత

పౌష్ఠిక ఆహారం అందించడం మన బాధ్యత : సీడీపీఓ లలిత

న్యూస్ వెలుగు తుగ్గలి : మండల కేంద్రమైన తుగ్గలి లో మండల పరిషత్ సమావేశ భవనంలో అంగన్వాడి వర్కర్స్ కు పౌష్ఠిక ఆహారం పోషన్  పై శిక్షణా తరగతులు  నిర్వహించినట్లు పత్తికొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ లలిత తెలిపారు.  వారు  మాట్లాడుతూ గ్రామాలలో పుట్టిన పిల్లల , బాలింతల , గర్భవతులు జాబితా, డేటా బేస్ లో అప్డేట్ చేయాలంన్నారు.  యుక్తవయసులో ఉండే బాలికల జాబితా తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రాల్లో నమోదయి ఉండాలని ఆమె సూచించారు.  అంగన్వాడి కేంద్రానికి వచ్చే చిన్నారులను తల్లిదండ్రులు ఎలా పెంచాలి అనే విషయాలను అంగన్వాడి వర్కర్స్ కు తెలియజేశారు. ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారాన్ని క్రమ పద్ధతిలో గర్భవతులకు, బాలింతలకు, చిన్నారులకు పంపిణీ చేయాలన్నారు. అనంతరం ట్రైనింగ్ కోఆర్డినేటర్లు త్రివేణి, అంబికా లు పోషన్ భీ- పడాయి భీ పై శిక్షణ ఇచ్చారు. 

Authors

Was this helpful?

Thanks for your feedback!