FlatNews Buy Now
ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించిన సీఎం

ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించిన సీఎం

ఏపీ న్యూస్ వెలుగు : తాడిపత్రి నియోజకవర్గం యాడికి సమీపంలోని పెండేకల్ రిజర్వాయర్ వద్ద  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు సోమవారం రైతులతో మాట్లాడారు. బిందు సేద్యం, ప్రకృతి వ్యవసాయం, పీఎండీఎస్, ఉపాధి హామీ సహా వివిధ అంశాలపై చర్చించారు. స్థానిక రైతులైన నీలం శ్రీనివాసరెడ్డి, లక్కు శ్యామలతో రిజర్వాయర్ పరిధిలో సాగునీటి అవసరాల కోసం ఎలాంటి విధానాలు అవలంభిస్తున్నారనే అంశాలపై చర్చించారు. రైతులు పరిమి చరణ్ కుమార్, పాపసాని ముని యుగంధర్‌లతోనూ బిందుసేద్యంతో కలుగుతున్న ప్రయోజనాలపై చర్చించారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ప్రభుత్వం తమకు 90 శాతం సబ్సీడికి ఇస్తోందని రైతులు సీఎంకు తెలిపారు. సాగులో అర్ధచంద్రాకార గుంతల విధానం ద్వారా నేల సారవంతంగా మారి మెరుగైన ఫలితాలు వస్తున్నట్టు రైతులు నందిని, ప్రమీలమ్మ ముఖ్యమంత్రికి తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS