ప్రజా ప్రయోజనాల అభివృద్దికి ‘ఉపాధి’ ఎక్కడ ..?

ప్రజా ప్రయోజనాల అభివృద్దికి ‘ఉపాధి’ ఎక్కడ ..?

న్యూస్ వెలుగు పత్తికొండ:  ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ సంఘం ఆద్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై  తుగ్గలి , ఉప్పర్లపల్లి, జొన్నగిరి, రాంపల్లి, జి . ఎర్రగుడి    పంచాయితీ  సెక్రేటరీలకు వినతి పత్రం అందించినట్లు రైతు సంఘం  నాయకులు తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా , తుగ్గలి మండలంలోని గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ సభలలో జాతీయ ఉపాధి హామీ పథకం అమలుపై వినతి పత్రాలు అంధించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఉపాధి కల్పన కోసం అనేక కార్యక్రమాలను అమలు చేశారని , గతంలో 241 పనులను గ్రామీణ ప్రాంతాల్లో చేసేవారని అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పతాకంలోని అనేక రకాల అభివృద్ది పనులను తొలగించి కేవలం 36 పనులను మాత్రమే కేటాయించడం ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటు చర్య అని ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శ్రీరాములు మండిపడ్డారు . గ్రామాల్లో రైతులకు గ్రామాల అభివృద్దికి అవసరమైన చెరువులు , కుంటాలు  పూడిక తీత పనులు, పంట రహదారులు ఏర్పాట్లు , సన్న , చిన్నకారు రైతుల పొలాల్లో రాళ్ళు తొలగిచ్చు పనులు, చెక్ డ్యాముల మరమ్మత్తులు , ఫారమ్ ఫండ్ పనులను ,  శ్మశాన వాటికల  అభివృద్ది పనులు  లాంటి ఎన్ను అభివృద్ది  పనులను కూటమి టిడిపి ప్రభుత్వం   నీరుకార్చేల వ్యవహరిస్తున్నారని తిరిగి ఈ పనులను పునరుద్దరించాలని వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  జి శ్రీరాములు , జి నారాయణ , వి జయన్న , కె కంబగిరి , పి ఈశ్వర్ ,  వి రామాంజినేయులు , ఎ బాస్కర్ , చిన్నారామన్న , కంబగిరి , ఏం రంగన్న, ఎస్ హాసన్ వలీ   తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!