
ప్రజా ఫిర్యాదులను త్వరగా పరిస్కరించండి
సత్యసాయి జిల్లా (పుట్టపర్తి) : ప్రజల నుండి ఫిర్యాదుల అందిన వెంటనే వాటిని పరిష్కరించాలని శ్రీ సత్యసాయి జిల్లా అదనపు ఎస్పి ఎన్ విష్ణు పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుండి సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో , జిల్లా అదనపు ఎస్పీ ఎన్ విష్ణు ఆధ్వర్యంలో “మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 40 అర్జీలను అదనపు ఎస్పీ నేరుగా స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులకు పంపించి చట్టపరంగా ఉన్న సమస్యలను సకాలంలో పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ బాధితుల ఇచ్చిన ఫిర్యాదులు పెండింగ్ పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని ప్రధానంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మహిళా సమస్యలు, ఎస్సీ ఎస్టీ,
వికలాంగులు, వృద్ధులు ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యతనిస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి, వారి సమస్యల పై చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు ఎస్పి ఎన్.విష్ణు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్ విష్ణు లీగల్ అడ్వైజర్ సాయినాథ్ రెడ్డి, డిసిఆర్బి సిఐ సతీష్,సిబ్బంది పాల్గొన్నారు.