కర్నూలు న్యూస్ వెలుగు:

ప్రజా సేవ చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కృష్ణ ధర్మ పరిషద్ రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల రామాంజనేయులు పిలుపునిచ్చారు. శనివారం కర్నూలు నగరంలోని వినాయక ఘాట్ లో ఉగాది పండుగను పురస్కరించుకొని శ్రీశైలం కు వెళ్తున్న కర్ణాటక పాదయాత్ర భక్తులకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియ కృష్ణ ధర్మ పరిషద్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం, మంచినీరు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణ ధర్మ పరిషద్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ… ఉగాది పండుగ సందర్భంగా శ్రీశైలం వెళ్ళు పాదయాత్రలకు కృష్ణ ధర్మ పరిషద్ వ్యవస్థాపకులు తాటి అభిషేక్ గౌడ్ ప్రత్యేక చొరవ చూపి సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ పంపిణీ కార్యక్రమం నాలుగు రోజులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున,పురుషోత్తం, పవన్, అనిల్, శంకర్, వెంకటేష్,సూర్య అభినయ్,శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!