
ప్రతి ఒక్కరూ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి
హోళగుంద,న్యూస్ వెలుగు:మండల కేంద్రంలో సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఈ నెల 7,8,9 తేదీన వినాయక చవితిని పురస్కరించుకుని పత్తికొండ డిఎస్పీ వెంకటరామయ్య ఆధ్వర్యంలో ఆలూరు సిఐ శ్రీనివాస్ నాయక్,ఎస్ఐ బాల నరసింహులు వినాయక మంటపాల నిర్వహకులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. అలాగే వినాయక మండపాల వద్ద నిర్వాహకులు రాత్రి పగలు ఉండి,ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే బాధ్యత తమదేనని తెలియజేశారు.ప్రతి ఒక్కరూ పండుగ సందర్భంలో పోలీస్ శాఖ నియమ నిబంధనలను పాటించాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్, జూనియర్ అసిస్టెంట్ రవి,బిజెపి నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద,బిజెపి మండల అధ్యక్షులు ప్రసాద్,వైసిపి మండల కన్వీనర్ షఫియుల్లా,ఎంపిపి తనయుడు ఈసా,టీడీపి నాయకులు గాళి వీరభద్ర గౌడ, దుర్గయ్య,సర్పంచులు భర్త శేషప్ప,హసనప్ప,కూటమి నాయకులు అశోక్,వీరేశ్,తిక్క స్వామి,తోక వెంకటేష్,కృష్ణయ్య,మౌలాసాన్,హుస్సేన్ పీరా,వార్డు సభ్యులు హమిద్,కిరాణి మర్చంట్ షబ్బీర్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.