ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి 

ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి 

జమ్మలమడుగు,న్యూస్ వెలుగు;రాబోవు గణపతి పండుగను పురస్కరించుకొని ప్రజలందరూ మట్టి గణపతులు ప్రతిష్టించి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపరంటెండెంట్ డాక్టర్. రాఫిక్ పాషా తెలిపారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కడప జిల్లా కమిటీ ముద్రించిన మట్టి గణపతులను ప్రటిస్టిద్దాం-పర్యావరణాన్ని కపాడుదాం అనే పోస్టర్ ను ఆవిష్కరించారు.ముందుగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న యువజన సంఘానికి అభినందనలు తెలిపారు.ప్రస్తుతం పర్యావరణం కాలుష్యం వలన అనేక ఉపద్రవాలు తలెత్తే ప్రమాదం భవిష్యత్ లో వుంది అన్నారు.ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ వాడటం వల్ల నీటిలోని జీవరాశులకు ప్రమాదం ఏర్పడుతుందని అలాగే భూమి కాలుష్యం అయితే పంటలకు ప్రమాదం వున్నదని అన్నారు. కాబట్టి అందరూ మట్టి విగ్రహాలను తీసుకొని పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు.జిల్లా కమిటీ సభ్యులు కటిగాళ్ళ.ప్రసాద్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ యువజన సంఘం పోరాటాలే కాదు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది అన్నారు.అందరం మట్టి గణపతిని ప్రతిష్టించి – పర్యావరణాన్ని కాపాడాల్సిన భాధ్యత మనందరి పైన వుంది అన్నారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు సూరి,నరసింహ,పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!