
ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడుతున్నాయి
ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడుతున్నాయి
న్యూస్ వెలుగు విశాఖపట్నం: విడిభాగాల నుంచి పోటీతత్వం వరకు భారతదేశ ఏరో స్పేస్ తయారీ, ఎంఆర్ఓ (Maintenance, Repair, and Operations) రంగాలను వేగవంతం చేయడం అనే అంశంపై భారత విమానయాన మంత్రిత్వశాఖ, CII, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫాక్చరర్స్ సంయుక్త ఆధ్వర్యాన విశాఖ నోవా టెల్ హోటల్ జరిగిన సదస్సులో మంత్రి నరలోకేష్ పాల్గొన్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ షిప్ వల్లే ఆర్సెలర్స్ మిట్టల్, గూగుల్ వంటి గ్లోబల్ కంపెనీలు రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్టు వల్ల ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయని. ఏపీలో పెట్టుబడులు పెట్టే ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలకు సులభతరమైన అనుమతుల కోసం విధానపరమైన మార్పులు తీసుకొచ్చినట్లు మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.