ప్రయాణికులకు శుభవార్త అందించిన రైల్వే శాఖ

ప్రయాణికులకు శుభవార్త అందించిన రైల్వే శాఖ

ఢిల్లీ  :    2024 క్రిస్మస్ పండుగ సందర్భంగా కేరళకు మరియు కేరళ నుండి వచ్చే ప్రయాణికుల  10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు  రైల్వే శాఖా ప్రకటించింది.  క్రిస్మస్ సందర్భంగా వివిధ రైల్వే జోన్లలో 149 ప్రత్యేక రైల్లను నడుపుతున్నట్లు వెల్లడించింది .

ఇది కాకుండా, శబరిమల యాత్రికుల సాఫీగా ప్రయాణించడం కోసం కేరళకు మరియు తిరిగి 416 ప్రత్యేక రైళ్ళను ప్రయానికుల అందుబాటులోకి తిసుకోచ్చినట్లు రైల్వే శాఖా పేర్కొంది. ఈ రైళ్లను  డిమాండ్‌కు అనుగుణంగా ప్రయాణీకులకు సాఫీగా,  సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే అన్నారు.

క్రిస్మస్ మరియు శబరిమల తీర్థయాత్రల సందర్భంగా కేరళకు ప్రత్యేక రైలు సేవలను అందించడానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన అభ్యర్థన మేరకు ఆమోదం తెలిపినందుకు కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.అధికారిక ప్రకటన ప్రకారం, జార్జ్ కురియన్ అభ్యర్థన మేరకు, అశ్విని వైష్ణవ్ కేరళకు ప్రత్యేక రైళ్లను నడపడానికి ఆమోదించారు. పండుగల సీజన్‌లో ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఈ ప్రకటనలు చేశారు.

క్రిస్మస్ పండుగ 2024 కోసం వివిధ జోన్లలో మొత్తం 149 ప్రత్యేక రైలు ప్రయాణాలు ప్రకటించబడ్డాయి. రైలు సర్వీసుల వివరాలు ఇలా ఉన్నాయి-

● నైరుతి రైల్వే (SWR): 17 ప్రయాణాలు

● సెంట్రల్ రైల్వే (CR): 48 ట్రిప్పులు

● ఉత్తర రైల్వే (NR): 22 ట్రిప్పులు

● సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR): 2 ట్రిప్పులు

● పశ్చిమ రైల్వే (WR): 56 ప్రయాణాలు

● వెస్ట్ సెంట్రల్ రైల్వే (WCR): 4 ట్రిప్పులు

కేరళలో శబరిమల యాత్ర కోసం 416 ప్రత్యేక రైలు ప్రయాణాల వివరాలు ఇలా ఉన్నాయి-

● నైరుతి రైల్వే (SWR): 42 ట్రిప్పులు

● దక్షిణ రైల్వే (SR): 138 ట్రిప్పులు

● దక్షిణ మధ్య రైల్వే (SCR): 192 ట్రిప్పులు

● ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECOR): 44 ప్రయాణాలు

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS