ప్రశ్నించలేనప్పుడు పదవులెందుకు రాజీనామా చేయండి : వైఎస్ షర్మిల
ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ ఛైర్మన్ వై ఎస్ షర్మిల అధికార ప్రతి పక్ష నేతలపై మరోసారి విమర్శన ఆశ్రలను సంధించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా అనడం ఆయన మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం అధికరంలోకి వచ్చి ఐదు నెలలు గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ప్రజలను తప్పుధోవ పట్టిస్తు కాలయాపన చేస్తున్నారని ఆమె విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టాల్సిన వైసీపీ ఎమ్మేల్యేలు మాత్రం ప్రజలు వారికి ఇచ్చిన హుందాతన్ని, హోదాను మరిచారని అన్నారు. ఐదు నెలలో కూటమి ప్రభుత్వం ఒక్క పథకాన్ని కూడ అములు చేయలేదని రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందన్నారు. గ్రామాల్లో లిక్కర్ గ్రూపులను ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం తమాషా చూస్తుందని , మహిళలపై జరుగుతున్నా ఆగయిత్యాలపై పేరుకు మాత్రమే కమిటీలు వేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఓటు వేసిన గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేని ఎమ్మేల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రజా హక్కులకోసం పోరాటం చేస్తుందని అధికారంలో వున్న లేకున్నా ప్రజల పక్షాన నేలబడే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు.