ప్రేమానురాగాలకు  ప్రతీక రక్షాబంధన్

ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్

ఆలూరు : హోళగుందలో   ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున  మన దేశంలో  రక్షాబంధన్ జరుపుకుంటుంది.సోదరి రాఖీని తన సోదరుడికి కడుతుంది.అయితే,పౌర్ణమి అంటేనే చంద్రుడు నిండు ప్రకాశంతో వెలుగుతూ కనిపిస్తాడు.రాఖీ అంటే నిండు ప్రకాశవంతమైన చంద్రుడని అర్థం.అందుకే మనిషి ఆత్మలను చంద్రుడితో పోలుస్తారు.మనిషి ఆత్మలు జనన,మరణం కాలచక్రంలోకి రావడం వల్ల తమకు ఉన్న ప్రకాశం,పవిత్రతను కోల్పోతాయట.అంటే మనిషిగా పుట్టారంటే ఆ ఆత్మకు ప్రకాశం ఉండదు.పవిత్రత ఉండదు.దింతో మనిషిగా ఉన్నప్పుడే మనిషి ఆత్మకు ప్రకాశింపజేయడం కోసం సోదరి రూపంలో దేవుడు ఈ రాఖీని కట్టిస్తాడట.
ఆప్యాయతకు, అనుబంధానికి ప్రతీకగా సోదర,సోదరీమణులు నిర్వహించుకునే రక్షాబంధన్(రాఖీ) పండుగ మండలంలోని గ్రామాల్లో సోమవారం సందడి సందడిగా అన్న తమ్ముళ్లకు సోదరీమణులు రాఖీలు కట్టుకుంటూ అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని చాటుకున్నారు.అలాగే నిండు నూరేళ్ళు ఈ సోదర బంధం నిలిచి ఉండాలని ఆశీర్వచనాలు అందుకున్నారు.ఓం శాంతి భాగ్యమ్మ కార్యాలయాలకు వెళ్లి అధికారులకు,ప్రజా ప్రతినిధులు రక్షాబంధన్ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!