
బీపీ, షుగర్, క్యాన్సర్కు ఉచిత స్క్రీనింగ్ లు నిర్వహించనున్న కేంద్రం
న్యూస్ వెలుగు; అధిక రక్త ప్రసరణ(హైబీపీ), మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులకు సంబంధించి దేశవ్యాప్తంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. ఫిబ్రవరి 20నుంచి మార్చి 31వరకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. 30సంవత్సరాలు పైబడిన వ్యక్తులు తమ సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రంలో ఈ వ్యాధులకు సంబంధించిన నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.
Was this helpful?
Thanks for your feedback!