బెజవాడలో రికార్డు వర్షం!
విజయవాడలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షం గత ఐదు దశాబ్దాల కాలంలోనే అత్యధికమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
50 ఏళ్ల రికార్డు బద్దలు
శుక్రవారం నుంచి శనివారం ఉద యం వరకు ఒక్క ‘తూర్పు’లోనే 174.2 మి.మీ. నమోదుఇది గత 200 ఏళ్లలోనే అత్యధిక వర్షపాతం
విజయవాడ, న్యూస్ వెలుగు : విజయవాడలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షం గత ఐదు దశాబ్దాల కాలంలోనే అత్యధికమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. . విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కురిసిన వర్షం గత 200 సంవత్సరాల్లో ఎప్పుడూ నమోదు కాలేదని పేర్కొన్నారు. అయితే దీనిపై ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమని, పాత రికార్డులు పరిశీలించాల్సి ఉందని జిల్లా యంత్రాంగం చెబుతోంది. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం విజయవాడ నగరంలో 2020 అక్టోబరు 13న 122.06 మి.మీ. వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో వర్షం పడింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అత్యధికంగా 174.2 మి.మీ. వర్షం పడింది. అలాగే శనివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 125.4 మి.మీ. నమోదైంది. ఈ రెండూ ఆల్‌టైమ్ రికార్డు వర్షపాతాలుగా చెబుతున్నారు. అలాగే విజయవాడ సెంట్రల్‌లో 172.4, 125.2., విజయవాడ నార్త్ మండలంలో 173.2, 125.8, విజయవాడ వెస్ట్‌లో 172.4, 125.2 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక ఎన్టీఆర్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి 7గంటల వరకు అత్యధికంగా 258.92 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. విజయవాడలో జాతీయ రహదారులు, ప్రధాన, అంతర్గత రహదారులపై రెండు నుంచి మూడు అడుగుల వరకు వర్షపు నీరు చేరింది. కాలనీలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముప్పాళ్ల వద్ద వాగులో ఓ యువకుడు కొట్టుకుపోతుండగా స్థానికులు రక్షించారు.