
బెజవాడలో వర్ష బీభత్సo…ఇంద్రకిలాద్రిపై విరిగిపడిన కొండచరియలు
విజయవాడ ,న్యూస్ వెలుగు : ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రెండు రోజుల నుంచి ముసురు పట్టి కురుస్తున్న వర్షం కారణంగా ఇంద్రకీలాద్రి గుట్టపై కొండచరియలు విరిగిపడ్డాయి. గుట్టపై ఉన్న ప్రోటోకాల్ రూమ్ పై భారీ బండరాళ్లు విరిగిపడ్డాయి. కాగా ప్రమాద సమయంలో ఘాట్ రోడ్డులో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ముందస్తుగానే ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
అలాగే గుట్టకు మరో వైపు విరిగిపడిన కొండచరియలు తీవ్ర విషాదాన్ని నింపాయి. భారీ వర్షాలతో ఇళ్లపై కొండచరియలు విరిగి పడుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. అనంతరం సహాయక చర్యలు చేపడుతుండగా మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి.దీంతో అప్రమత్తమైన అధికారులు సమీపంలోని ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేస్తున్నారు. కాగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు.


 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist