భక్తులందరూ అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించాలి
విజయవాడ, న్యూస్ వెలుగు:శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు మహా మండపంలోని అన్నదాన విభాగం ను పరిశీలించారు. ఇందులో భాగముగా మహామండపం రెండోవ అంతస్తు లోని అన్నదానం హాలు నందు ఈవో అన్నప్రసాదము లోని భోజనం, వంటకములను క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఎక్కువ మందికి అన్నప్రసాదం అందించాలన్న సంకల్పంతో ఆలయ ఈవో ఆదేశముల మేరకు మహమండపం 1 వ అంతస్తులో కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేసిన విషయం విదితమే. 1 వ అంతస్తు నందు 2 వ అంతస్తు నందు జరుగుచున్న అన్నప్రసాదం ఏర్పాట్లను అన్నప్రసాదం స్వీకరించిన భక్తులతో మాట్లాడి పదార్థాల యొక్క రుచి, నాణ్యత అడిగి తెలుసుకునగా భక్తులు సంతృప్తి ని వ్యక్తం చేశారు. భక్తులందరూ అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించే విధముగా చూడాలని, అన్నప్రసాదం మరింత రుచిగా ఉండు విధముగా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమములో ఆలయ ఈవో తో పాటుగా అన్నప్రసాదం విభాగం ఏఈవో పి. చంద్రశేఖర్ పాల్గొన్నారు.