
భూ రీ సర్వే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్.
హోళగుంద, న్యూస్ వెలుగు: భూ రీ సర్వేలో రైతులకు నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తహసీల్దార్ సతీష్,రీసర్వే తహసీల్దార్ ముకుంద రావు,గ్రామ సర్వేయర్లు సూచించారు.శనివారం మండల పరిధిలోని సుళువాయి,నాగర కన్వి గ్రామాల్లో జరుగుతున్న భూ రీ సర్వే సమస్యల పరిష్కార పనులను సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆకస్మికంగా పరిశీలించారు.అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంకు విచ్చేసి రికార్డులను తనిఖీ చేశారు.అదేవిధంగా కంప్యూటర్ రూమ్,విసి రూమ్ లను పరిశీలించారు.తదనంతరం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ రైతుల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తూ వస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో డివిజన్ సర్వేయర్,విఆర్వోలు,గ్రామ సర్పంచులు,రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!