న్యూస్ వెలుగు ఒంటిమిట్ట : కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఒంటిమిట్ట మండలాభివృద్ధికి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ సుగవాసి ,  బాల సుబ్రహ్మణ్యం ఆదివారం తెలిపారు.

 మండలాభివృద్ధి విషయంపై స్థానిక మండల నాయకులు ఇన్చార్జిని కలవడంతో  ఈ సందర్భంగా ఆయన నాయకులతో కార్యకర్తలతో మాట్లాడుతూ మండలాన్ని అభివృద్ధిలో  తమవంతుగా కృషిచేసి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని మండల ప్రజల మన్ననలు పొందాలన్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో వీరబల్లి మండలం వేల్పులమిట్ట గ్రామం నుండి ఒంటిమిట్ట మండలం చింతరాజు పల్లి గ్రామం వరకు తారు రోడ్డు వేయడం త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ సంభాషణతో స్థానిక మండల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షుడు గజ్జల. నరసింహారెడ్డి, కొత్తపల్లె. బొబ్బిలి రాయుడు, కాంట్రాక్టర్ ఎస్ .వెంకటరమణ, చింతరాజు పల్లె సర్పంచ్ ప్రతినిధి రమణ, పత్తి .సుబ్బరాయుడు, సుంకేసుల .భాష, ముద్దు. కృష్ణారెడ్డి, శంకర్ ,చెన్నయ్య, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
.
                
                    
                    
                    
                                                                                    
                                                                            
                        
                                                                                                                                    
                                                                                                                        
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                    
                                                                                                                    - 
                                                                                                                                                                                    
                                                            
                                                            
                                                                                                                                                                                                                                                                        
                                                                                                                                                    Y.Bala guru natha sarma , Vontimitta kadapa District devotional writings                                                                                                                                                   View all posts
 
 
                        
                                             
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!