
మండల ప్రజాపరిషత్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే
ఆలూరు :హోళగుంద మండల కేంద్రంలో మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిపి నూర్జహాన్ బీ అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ముఖ్య అతిథిగా హాజరయ్యరు.ముందుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి,మహర్షి వాల్మీకి,డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్,వైద్య,ఆర్ అండ్ బీ అధికారులు మాట్లాడుతుండగా ప్రజా ప్రతినిధులకు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నిలదీశారు.అనంతరం ఎమ్మెల్యే వీరుపాక్షి మాట్లాడుతూ మండలంలో ఉండే ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ఇది ఒక మంచి వేదిక అని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాలలో అతి సార వ్యాధులు ప్రబలకుండా గ్రామాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలని,ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు చేయించాలన్నారు.అదేవిధంగా గ్రామాల్లో ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు ప్రమాద స్థాయిలో ఉంటే వాటి మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు.
గ్రామాల్లో తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే విరుపాక్షి ని నాయకులు సన్మానించారు. గ్రామాల్లో రైతుల సమస్యలను వ్యవసాయ శాఖ అధికారులు పరిస్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్డిఓ నాగేశ్వర్ రావు,జడ్పిటిసి కురువ బుజ్జమ్మ,ఎంపీడీఓ ఆజాద్,ఎంపీటీసీలు, కో- అప్షన్ మెంబర్,సర్పంచ్లు,మండల స్థాయి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.